చంద్రబాబు నాయుడు కు చుక్కెదురైంది రిమాండ్..14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు…

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది..

*చంద్రబాబునాయుడు కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్…!!

*చంద్రబాబు నాయుడు కు రిమాండ్*

*14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు…

*రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని తీర్పు.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు..

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండు రిపోర్టుపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఉదయం 7 గంటలకు వాదనలు ప్రారంభం కాగ, సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హోరాహోరీగా వాదనలు వినిపించారు. చంద్రబాబును రిమాండుకు ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది…