“ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..

నర్సాపురం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు .. సీఎంగా 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు, మహిళలు కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలికారు…

ఈ ప్రాంతం నాకు కొత్తేమీ కాదు…. 45ఏళ్ల రాజకీయ చరిత్ర లో నర్సాపురం, మొగల్తూరు లకు చాలా సార్లు వచ్చాను. ఈ ప్రాంతాలపై మంచి అవగాహన ఉంది. ఇదే రోజు 31ఏళ్లకు ముందు సి ఎం అయ్యాను. రాజకీయం లో అనేక మార్పులు చూసాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పర్యటిస్తున్నాను అంటే అక్కడ ప్రజల పరిస్థితులు గమనించి ఆ ప్రాంతానికి ఏమి చేయాలన్నదే నా ఆలోచన. రాష్ట్రం లో ఆర్థిక అసమానతలను తొలగించి పేదవారు పట్ల ప్రభుత్వం కమిట్మెంట్ గా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా మత్య్సకారుల కుటుంబాలకు పింఛను పంపిణీ చేశారు. వేటకు వెళ్లే ఫెర్రీ పాయింట్‌కు ముఖ్యమంత్రి మొదట చేరుకున్నారు. పడవల వద్ద కూర్చున్న పలుగురు మత్స్యకారులతో ముచ్చటించారు. తిరుమని స్వామి అనే మత్య్సకారునికి స్వయంగా సీఎం పింఛను సొమ్మును అందజేశారు. వారి కుటుంబాల యోగక్షేమాలు, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే పథకాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. వేట సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు….

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సొంతూరైన నర్సాపురం నియోజకవర్గంలోని మొగల్తూరులో ఆయన పర్యటన ఆసక్తికరంగా సాగింది. ‘పేదల సేవలో’ కార్యక్రమం కోసం వచ్చిన ఆయన, స్థానిక మత్స్యకారులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆప్యాయమైన ఆహ్వానం మేరకు పడవలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

పర్యటనలో భాగంగా తొలుత ఫెర్రీ పాయింట్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు, అక్కడ పడవల వద్ద ఉన్న మత్స్యకారులతో ముచ్చటించారు. తిరుమని స్వామి అనే మత్స్యకారుడికి స్వయంగా పింఛను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన మత్స్యకారులు, వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.20 వేల ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తోందని ముఖ్యమంత్రికి వివరించారు.

సీఎంతో సంభాషణ సందర్భంగా ఓ మత్స్యకారుడు తమతో పాటు పడవలోకి రావాలని ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని చిరునవ్వుతో స్వీకరించిన చంద్రబాబు, వెంటనే పడవ ఎక్కి వారితో కలిసి కాసేపు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో, సముద్రంలో వారి జీవనశైలి గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. “వేటకు వెళ్లినప్పుడు ఎన్ని రోజులు సముద్రంలో ఉంటారు? ఆ సమయంలో భోజన సదుపాయాలు ఎలా ఉంటాయి?” వంటి వివరాలను అడిగి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సముద్రంలో మత్స్యకారులు గల్లంతవుతున్న ఘటనలపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కోనసీమకు చెందిన మత్స్యకారులు దాదాపు 20 రోజులు సముద్రంలో చిక్కుకుపోయినప్పుడు, కోస్ట్‌గార్డ్, నేవీ వంటి కేంద్ర విభాగాల సహకారంతో వారిని ఎలా సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారో గుర్తుచేశారు. మత్స్యకారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారిక కార్యక్రమానికి హాజరైనప్పటికీ, చంద్రబాబు నేరుగా మత్స్యకారుల వద్దకు వెళ్లి, వారి పడవలో ప్రయాణించి వారిలో ఒకరిగా కలిసిపోవడం స్థానికులను ఆకట్టుకుంది.