సిమెంటు ధరల్లో మార్పులు…

సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో, దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు; తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్‌’కు డీలర్లు తెలిపారు. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు. ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది….తమిళనాడులో ఒక టాప్‌ బ్రాండ్‌ సిమెంటు ధర రూ.400 దిగువకు; కర్ణాటక, కేరళల్లోనూ బస్తా ధర రూ.360-400 నుంచి రూ.340-380కి చేరినట్లు డీలర్లు వివరించారు..

ఊహించని విధంగా తగ్గింపు..
..
గిరాకీ తగ్గడానికి తోడు కొన్ని ప్రాంతాల్లో డీలర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాలకు తోడు, ద్రవ్యలభ్యత సమస్యలతో గిరాకీ మరింతగా తగ్గిందని డీలర్లు చెబుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో నవంబరు చివరి వారం నుంచి డిసెంబరు తొలి వారం వరకు భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్లు అధిక స్థాయిలో ఉండడంతో కొత్త ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. బిల్డర్ల వద్ద డబ్బులు లేక సిమెంటు వినియోగం సైతం తగ్గింది. జనవరి మధ్యలో కానీ, ఫిబ్రవరి ప్రారంభంలో కానీ దక్షిణాదిన గిరాకీ పుంజుకునే అవకాశం ఉందని సిమెంటు కంపెనీలు భావిస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు..