కెనడా ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం..మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను.” . ప్రధాని మోడీ..

ట్రంప్‌’ భయంతో అధికార పార్టీకే పట్టంకట్టిన కెనడా ప్రజలు

ప్రధానిగా మార్క్‌ కార్నీ..

మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను.” . ప్రధాని మోడీ.

కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్‌ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది..
కెనడాపై ఆర్థిక ఒత్తిడి బెదిరింపుల నేపథ్యంలో జరిగాయి. మార్క్ కార్నీ, మాజీ బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్, జస్టిన్ ట్రూడో రాజీనామా (Justin Trudeau resigns) తర్వాత మార్చి 2025 లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

అతను ట్రంప్‌కు వ్యతిరేకంగా జాతీయవాద సందేశంతో ప్రచారం చేసి విజయం సాధించారు. కాగా మార్క్ కార్నీ విజయం (Mark Carney’s victory)పై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందులో.. “కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికైనందుకు, విజయం సాధించిన లిబరల్ పార్టీకి అభినందనలు. భారతదేశం, కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్ట పాలన పట్ల దృఢమైన నిబద్ధత, శక్తివంతమైన ప్రజల మధ్య సంబంధాలతో కట్టుబడి ఉన్నాయి. మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, మా ప్రజలకు మరిన్ని అవకాశాలను తెరవడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను.” అని ప్రధాని మోడీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు…

కెనడా ఆక్రమణ ట్రంప్‌ తరంకాదు: మార్క్‌ కార్నీ
లిబరల్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్‌ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా-అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.

అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్‌ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ
కెనడా ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.

సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులు
కెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్‌ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్‌ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్‌ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్‌ దలీవాల్‌(లిబరల్‌) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్‌ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్‌ పార్టీ(ఎన్‌డీపీ) నేత జగ్మీత్‌సింత్‌(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్‌ పార్టీ అభ్యర్థి వేడ్‌ చాంగ్‌ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు…

మరోపక్క తన ప్రచారంలో కార్నీ.. భారత్ తో సంబంధాలు.

మరోపక్క తన ప్రచారంలో కార్నీ.. భారత్ తో సంబంధాలను పునర్నిర్మించడం ప్రాధాన్యతగా గుర్తించారు. ఇందులో భాగంగా… భారత్ తో సంబంధాన్ని పునర్నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయని.. ఆ వాణిజ్య సంబంధం చుట్టూ విలువల ఉమ్మడి భావన ఉండాలని.. తాను మరోసారి ప్రధాని అయితే దాన్ని నిర్మించే అవకాశం కోసం ఎదురుచూస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.