భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి.
ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన రేపిన ప్రకంపనలు ఈ రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించాయి….
జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలో ఈ హత్య చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనేది కెనడా చేస్తోన్న ఆరోపణ లు..
హిందువులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. కెనడాలోని హిందూ సమాజంలో నెలకొన్న ఆందోళనపై తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేసింది. ఇది కెనడా పౌరుల భద్రతకు సంబంధించిన అంశమని కూడా అభివర్ణించింది. సోషల్ మీడియాలో హిందూ వ్యతిరేకతతో కూడిన వీడియోలు ఇటీవల కాలంలో వైరల్ కావడం తమ ఆందోళనను మరింత పెంచిందని హిందూ ఫోరమ్ ఫర్ కెనడా తన లేఖలో పేర్కొంది. ఉగ్రవాదుల జాబితాలో భారత్ చేర్చిన గురుపత్వంత్ పన్నమ్ కెనడాలోని హిందువులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇటీవల విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. హిందూ కెనేడియన్లు దేశం వీడాలని కూడా హెచ్చరించాడు…ఉగ్రవాదుల జాబితాలో భారత్ చేర్చిన గురుపత్వంత్ పన్నమ్ కెనడాలోని హిందువులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇటీవల విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. హిందూ కెనేడియన్లు దేశం వీడాలని కూడా హెచ్చరించాడు…ఈ నేపథ్యంలో- తమకు రక్షణ కల్పించాలంటూ హిందూ ఫోరం కెనడా సభ్యులు.. జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కెనడా ప్రజా భద్రత వ్యవహారాల శాఖ మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌కు లేఖ రాశారు. కెనడాలో నివసించే హిందువులందరూ దేశం విడిచి వెళ్లాలంటూ నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ చేసిన ప్రకటనను ఇందులో పొందుపరిచారు..
పరస్పర ఉపయోగాలే లక్ష్యంగా దీర్ఘకాలిక వ్యూహాలతో అంతర్జాతీయ సంబంధాలు బలోపేతమవుతాయని హిందూ ఫోరమ్ కెనడా పేర్కొంది. దేశీయ పరిస్థితులు వీటిని ప్రభావితం చేయకూడదని కూడా అభిప్రాయపడింది…