భారత రాయబారిపై కెనడా వేటు..హెచ్చరికలకు భయపడి ఇలా చేశారా..!!

చల్లారని చిచ్చు.. భారత రాయబారిపై కెనడా వేటు

భారత్, కెనడా మధ్య సంబంధాలు ఏమంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సదస్సులోనూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇతర దేశాధినేతలతో పాటు ప్రధాని మోదీతోనూఅంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ఇప్పుడేమో భారత్, కెనడా మధ్య వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ నెలలో ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్‌ను వాయిదా వేస్తున్నట్టు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జీ ప్రతినిధి శాంతి కోసెంటినో స్పష్టం చేశారు..

భారతదేశం తర్వాత ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన కెనడాలో.. ఖలిస్తానీ కార్యకలాపాలు విస్తృతంగా పెరగడం వల్లే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జీ20 సదస్సు తర్వాత ఖలిస్తానీ సానుభూతిపరుల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో.. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రేక్ పడింది..

భారత్-కెనడా మధ్య ఖలిస్తానీ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇదే కారణంతో 2 దేశాల మధ్య వాణిజ్య చర్చలకు ఇప్పటికే బ్రేక్ పడగా.. తాజాగా భారత రాయబారిపై కెనడా వేటు వేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ను భారత ఏజెంట్లే చంపారని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఇది తమ దేశ సార్వభౌమత్వంపై దాడి అని పేర్కొన్న ఆయన.. కేసు తేలేవరకు భారత రాయబారిపై వేటు కొనసాగుతుందని ప్రకటించారు…

హెచ్చరికలకు పోయిపడే ఇలా చేశారా..!!

కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసి వేయాలని హెచ్చరికలు జారీ చేసింది ఖలిస్థాన్ గ్రూప్. జీ 20 సదస్సుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఢిల్లీలో ఉండగానే ఖలిస్థాన్ గ్రూప్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడింది… భారతరాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేసి ప్రభుత్వ ప్రతినిధిని వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని హెచ్చరించింది. లేదంటే తీవ్రపరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇలా గడిచిన 48 గంటల్లోనే కెనడా నుంచి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.