క్యాన్సర్లకు చెక్ పెట్టే ఆహారాలు..

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమవుతున్న వ్యాధి క్యాన్సర్. శరీరంలో కణాలు నియంత్రణ లేకుండా పెరిగే స్థితిని క్యాన్సర్ అంటారు. వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి…ఈ వ్యాధి శరీరంలో ఏ అవయవానికైనా సోకవచ్చు. ఈ మహమ్మారి ఎవరికి, ఎందుకు వస్తుందో చెప్పలేం. ప్రస్తుతం రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హెల్తీ డైట్, రెగ్యులర్‌గా వ్యాయమం, మద్యపానం, ధూమపానం అలవాటు మానుకోవడం వంటి జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఈ వ్యాధి రిస్క్‌ను కొన్ని రకాల ఆహార పదార్థాలు తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

ఈ వ్యాధి శరీరంలో ఏ అవయవానికైనా సోకవచ్చు. ఈ మహమ్మారి ఎవరికి, ఎందుకు వస్తుందో చెప్పలేం. ప్రస్తుతం రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హెల్తీ డైట్, రెగ్యులర్‌గా వ్యాయమం, మద్యపానం, ధూమపానం అలవాటు మానుకోవడం వంటి జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఈ వ్యాధి రిస్క్‌ను కొన్ని రకాల ఆహార పదార్థాలు తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

* బెర్రీలు

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి బెర్రీ పండ్లను డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. దీంతో క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.

* సిట్రస్ పండ్లు

నారింజ, ద్రాక్ష, నిమ్మ, జామ వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి. ఫైబర్, కెరోటినాయిడ్స్, ఫోలేట్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు, సమ్మేళనాలు సిట్రస్ పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని అందించి క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి..

యాపిల్స్ బేరి

రోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిందే. యాపిల్‌తో పాటు బేరి పండును డైట్‌లో చేర్చుకుంటే కొలొరెక్టల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి…

అల్లియం కూరగాయలు

వెల్లుల్లి, ఉల్లిపాయలను అల్లియం కూరగాయలు అంటారు. క్యాన్సర్లపై పోరాడే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు వీటిలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటాయి.

* సీఫుడ్

సాల్మన్, ట్రౌట్, మాకేరెల్, సార్డినెస్ వంటి ఫ్యాట్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐకోసపెంటెనోయిక్ యాసిడ్ (EPA), డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్ (DHA) సమృద్ధిగా లభిస్తాయి. ఇవి సెల్యులార్ నష్టాన్ని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే చేపలను డైట్‌లో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కొలొరెక్టల్ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక క్యాన్సర్ల రిస్క్‌ను తగ్గించుకోవచ్చు..

చిక్కుళ్లు

బీన్స్, చిక్కుడు, గోరుచిక్కుడు వంటి కూరగాయల్లో ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫినోలిక్ వంటి బయోయాక్టివ్ పదార్థం కూడా ఉంటుంది. ఇవి మంటను తగ్గించడంతో పాటు సెల్యులార్ నష్టం నుంచి రక్షించగలవు. దీంతో క్యానర్ రిస్క్ తగ్గుతుంది.

* హెర్బల్స్, మసాలా దినుసులు

పసుపు, రోజ్మెరీ, ఒరేగానో, అల్లం వంటి హెర్బల్స్, సుగంధ ద్రవ్యాల్లో క్యాన్సర్‌పై పోరాడే సమ్మేళనాలు ఉంటాయి. పసుపులో కర్కుమిన్ శక్తివంతమైన యాంటీకాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోజ్మెరీ, ఒరేగానోలో రోస్మరినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా యాంటీకాన్సర్ ప్రభావాలను కలిగి ఉంటుంది. అందుకే ఈ మసాలా దినుసులను డైట్‌లో చేర్చుకోవాలి..