కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు…రెండో డీఏ పెంపు ప్రకటనకు ముహూర్తం ఖరారు..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. రెండో డీఏ పెంపు ప్రకటనకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం.
7th Pay Commission DA Hike Latest News : దేశంలోని కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. 2023 జులై డియర్‌నెస్ అలవెన్స్ (DA) ప్రకటన కోసం వీరందరూ ఎదురుచూస్తున్న చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది మొదటి డీఏ నాలుగు శాతం పెరగ్గా.. తాజాగా రెండో డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంతకీ ఎంత మొత్తంలో డీఏ(DA Hike) పెంచబోతున్నారు? పెంచిన డీఏను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందో అనే అలోచన చేస్తూన్న అధికారులకు ఓ మంచి సమాచారమే అందినట్లు తెలుస్తోంది..
ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రెండుసార్లు పెంచుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా నెలవారీ జీతం, పెన్షన్ సంపద తగ్గుతున్న కొనుగోలు శక్తిని ఎదుర్కోవడానికి కేంద్ర సర్కార్ ప్రతి ఆరు నెలలకోసారి DA రేటును సవరిస్తుంది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ పెరిగినప్పుడల్లా.. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెరుగుతుంది. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు 4 శాతంగా ఉండొచ్చని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతం ఉండగా.. మరో 4 శాతం పెరిగితే డీఏ 46 శాతానికి చేరుకుంటుంది.

ఎప్పుడు ప్రకటిస్తారంటే.?

DA Hike Announcement Details Soon in October : కేంద్ర సర్కార్ దసరా, దీపావళి గిఫ్ట్గా డీఏ పెంపు ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అక్టోబర్లో డీఏ పెంచినా.. 2023 జులై నుంచి డీఏ వర్తిస్తుంది. ఈ నెలలో డీఏ పెంచితే జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల డీఏ బకాయిలు కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు భారీగా పెరుగనున్నాయి.