టమాటా ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
టమాటా ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) సంస్థల్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది..
టమాటా(tometo) ధరలు(cost) మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో దాదాపు కిలో టమాటా ధర రూ. 150 నుంచి రూ. 200 పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ. 250 కంటే అధిక ధరకు టమాటాను విక్రయిస్తున్నారు. అయితే ఇటీవల భారీగా పెరిగిన చికెన్ ధరలు.. నేల చూపులు చూడటంతో కిలో చికెన్ రూ.150 నుంచి రూ.180 మధ్య అమ్ముతున్నారు…టమాటానే ఎక్కువ ధర ఉందని నెటిజన్లు చిత్రవిచిత్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అటు.. ప్రతిపక్షాల నుంచి కూడా కేంద్ర(Central) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టమాటా ధరలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం.. టమాటా ధరలను తగ్గించి.. అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది..టమాటా పంటను ప్రభుత్వం అధిక సంఖ్యలో సేకరించి.. సబ్సిడీ(subsidy) మీద వినియోగదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరల తగ్గింపు చర్యల్లో భాగంగా అధికంగా టమాటాలను పండించిన రాష్ట్రాల నుంచి పంటను సేకరించనున్నారు. దీని కోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టింది. టమాటా పంటను కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెట్(market federation)ఫెడరేషన్ – నాఫెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్‌లకు ఆదేశాలు జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల్లోని మండీల నుంచి సేకరించిన టమాటల్ని గత నెలలో రిటైల్ ధరలు భారీగా పెరిగిన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ శుక్రవారం నాటికి ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని వినియోగదారులకు తగ్గింపు ధరలకు టమాటలు లభించబోతున్నాయి…