కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ను బర్తరఫ్ చేయాలి.. టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్
కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా ఎంపీలు ఇవాళ లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంపలేదని బిశ్వేశ్వర్ తుడు అబద్ధాలాడి, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. గిరిజనులకు, తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణలు చెప్పాలని ఎంపీలు డిమాండ్ చేశారు. సభను తప్పుదోవ పట్టించిన బిశ్వేశ్వర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిందని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.