ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం కేసీఆర్ కొత్తనాటకాలు..కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..

ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్తనాటకాలు ఆడటం, కొత్త కథలు చెప్పడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలపై న్యాయస్థనాలు సుమోటాగా తీసుకుని మొట్టికాయలు వేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఫామ్‌హౌస్‌ డ్రామా, పోలీసు విభాగానికి ఎలాంటి ఆధారాలు లేని కేసులో ప్రభుత్వం సిట్ వేసి ప్రజలను మభ్యపెట్టాలనుకుందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని, పాలనను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.