తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య త‌గ్గిన‌యి.. కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమ‌ర్..

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య త‌గ్గిన‌ట్లు ఇవాళ కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమ‌ర్ తెలిపారు. లోక్‌స‌భ‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2014 త‌ర్వాత రాష్ట్రంలో అనూహ్య రీతిలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 2014 నుంచి 2020 నాటికి స‌గానికి పైగా అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తెలంగాణ‌లో 2014లో 898 మంది రైతులు చ‌నిపోగా, 2020లో 466 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు మంత్రి తోమ‌ర్ చెప్పారు.
లోక్ సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014లో 898 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, 2015లో 1358 మంది 2016లో 632 మంది, 2017 846 మంది, 2018లో 900 మంది, 2019లో 491 మంది, 2020లో 466 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు.