చైనా… ఈ పేరు వింటేనే శత్రుదేశాలకు దడ. ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాలలో చైనా ఒకటి. కానీ ఇప్పుడీ డ్రాగన్ కంట్రీ ఇండియా పేరు వింటేనే భయపడుతుంది.ప్రపంచంలోని సూపర్ పవర్స్‌లో ఒకటి, ఇప్పుడు మన దేశాన్ని చూస్తేనే వణుకుతుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన డ్రాగన్ నేషన్,వేగంగా మారుతున్న జియో – పొలిటికల్ పరిస్థితులతో ఆత్మరక్షణలో పడింది. ఎప్పుడు కవ్వించే చైనా ఎందుకు ఆత్మరక్షణలో పడింది? అసలు ఇండియాని చూస్తే ఎందుకు భయపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి పెరుగుతున్న ఆదరణే దీనికి కారణమా ?
1949 లో చైనా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది .కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, అధికార పార్టీ కుమింగ్‌టంగ్‌కి మధ్య జరిగిన భీకర పోరు లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పైచేయి సాధించింది. మావో జెడాంగ్ , ఈ సివిల్ వార్ లో కీలకమైన పాత్ర పోషించాడు. మావో జెడాంగ్ ఫ్యూడల్ వ్యవస్థ పై పోరాడి కమ్యూనిస్ట్ దేశాన్ని స్థాపించాడు.అలాంటి కమ్యూనిస్ట్ కంట్రీ, బూర్జువా ప్రభుత్వాలకు ధీటుగా ఎదుగుతూ వచ్చింది. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ల తర్వాత చైనా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. కానీ చైనా అభివృద్ధి ఇండియాకి పూర్తి విరుద్దంగా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మొదలైన చైనా ప్రయాణం 1978లో తీసుకున్న ఆర్ధిక సంస్కరణల వలన అగ్రరాజ్యాలతో సమానంగా ఎదిగింది. 1978 లో ఆర్ధిక సంస్కరణల కారణంగా క్లోజ్డ్ మార్కెట్ ఎకానమీ నుండి ఓపెన్ మార్కెట్ ఎకానమీకి మార్పు చేసింది.ఈ ఒక్క నిర్ణయం చైనా తలరాతను మార్చింది . ఇండియాకి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. చైనా ఎదుగుదల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను సంచలనం . ఇంతటి ఘనత ఉన్న చైనా,ఇండియా ని చూసి ఆత్మరక్షణలో పడింది. ఇండియా ఎదుగుదల చైనా కి చెక్ పెడుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ప్రస్తుతం అన్ని రంగాలలో చైనా అభివృద్ధి లో దూసుకుపోతుంది అయినా ఇండియా అంటే ఎందుకు భయపడుతోంది అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఒకసారి ఇండియా, చైనాని అన్ని అంశాలలో పోల్చిచూద్దాం.
worlddata.info వెబ్‌సైట్ గణాంకాలని పరిశీలిస్తే ..
ప్రస్తుత చైనా జనాభా 142,56,71,000, ఇండియా జనాభా 142,57,76,000.ఇండియా 2023లో చైనా జనాభాని అధిగమించింది.చైనా విస్తీర్ణం 9.6 మిలియన్ చదరపు కి.మీ, ఇండియా విస్తీర్ణం 3.3 మిలియన్ చదరపు కి.మీ. ఇండియా విస్తీర్ణం కంటే చైనా మూడు రెట్లు ఎక్కువ.చైనా పురుషుల ఆయుర్దాయం 75 ఏళ్ళు ; భారతీయ పురుషుల ఆయుర్దాయం 66 ఏళ్ళు. చైనా మహిళల ఆయుర్దాయం 81 ఏళ్ళు ,ఇండియా మహిళల ఆయుర్దాయం 69 ఏళ్ళు. ఈ గణాంకాలని చూస్తే చైనాలో ఆయుర్దాయం ఎక్కువ అని అర్ధం చేసుకోవొచ్చు. చైనాలో సగటు వయస్సు 38.4 ఏళ్ళు,ఇండియాలో సగటు వయస్సు 28.7 ఏళ్ళు. ఇప్పుడు భారతదేశ జనాభాలో అత్యధిక శాతంలో యువకులు ఉన్నారు. అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది ఇండియాలో ఎక్కువ. యువత ఎక్కువగా ఉంటే ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
చైనా జీడీపీ 2022 గణాంకాల ప్రకారం 18 ట్రిలియన్ డాలర్లు, అదే ఇండియా జీడీపీ కేవలం 3 ట్రిలియన్ డాలర్లు .
ఇక్కడ మనం రెండు దేశాల జీడీపీ చరిత్రలోకి ఒకసారి వెళితే 1950లో చైనా జీడీపీ 100 బిలియన్ డాలర్లు , ఇండియా జీడీపీ 50 బిలియన్ డాలర్లు అంటే ఇండియా జీడీపీకి చైనా జీడీపీ రెండు రెట్లు ఎక్కువ.1990లో చైనా జీడీపీ 360 బిలియన్ డాలర్లు, ఇండియా జీడీపీ 326 బిలియన్ డాలర్లు .ఇక్కడ ఇండియా జీడీపీకి చైనా జీడీపీకి పెద్ద తేడాలేదు. కానీ 2022లో చైనా జీడీపీ ఇండియా కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఈ తీవ్రమైన తేడాలకి కారణాలు ఏంటి… చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ 1991లో చేరితే .. ఇండియా మాత్రం 1995లో చేరింది అయ్యింది. ఈ కాల వ్యవధి తేడాల వలన జీడీపీలో భారీ తేడా ఏర్పడింది.
చైనా ఎగుమతులు 2.61 ట్రిలియన్ డాలర్లు, ఇండియా ఎగుమతులు 0.54 ట్రిలియన్ డాలర్లు. చైనా తయారీ రంగం ఇండియా తయారీ రంగంపై ఆధిపత్యం చెలాయిస్తుంది కానీ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ESC), ఇండియా ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ అతిపెద్ద ఎగుమతిదారు అని తెలిపింది. జీవన వ్యయం (USA=100% అయితే) చైనా 57.58%, ఇండియా 26.92%. ఇందులోనూ చైనా,ఇండియాని ఆధిపత్యం చెలాయిస్తుంది. నిరుద్యోగ రేటు చైనాలో 4.9% , ఇండియా నిరుద్యోగ రేటు 7.3% . నిరుద్యోగ రేటు ఇండియాని వెనక్కి నెట్టేస్తుంది. అక్షరాస్యత శాతం చైనా 99%, ఇండియా అక్షరాస్యత శాతం 75%.అక్షరాస్యతలో చైనా ముందుంది. చైనా లో పారిశ్రామిక వర్గం అభివృద్ధి అవ్వడానికి ఇది దోహదపడింది.
ఇక రవాణా విషయానికొస్తే, చైనాలో మొత్తం రహదారి పొడవు 52,00,000 km, అదే ఇండియాలో రహదారి పొడవు 67,00,000 km. చైనాతో పోల్చినప్పుడు, ఇండియాలో రహదారి నెట్వర్క్ సాంద్రత ఎక్కువ . చైనాలో మొత్తం రైల్వే నెట్‌వర్క్ 1,50,000 km, అదే ఇండియా రైల్వే నెట్‌వర్క్ 68,988 km. చైనా రైల్వే నెట్‌వర్క్ దాదాపు మూడు సార్లు ఇండియా. దేశ వాణిజ్యం అనేది రైల్వేలు, రోడ్డు మార్గాలు మీద ఆధారపడి ఉంటాయి. చైనాలోని మొత్తం విమానాశ్రయాలు 214, ఇండియాలో మొత్తం విమానాశ్రయాలు 82. చైనాలోని జలమార్గాల పొడవు 27,700 km అదే ఇండియాలో 20,275 km. చైనా మౌలిక సదుపాయాలకు ఇండియా ఎప్పటికి అందనంత దూరంలో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలలో చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. కానీ.. కోవిడ్ అనంతరం జరుగుతున్న పరిణామాలు కీలకంగా మారుతున్నాయి…ఇక చైనా విదేశీ పెట్టుబడి చూస్తే…కోవిడ్ అనంతరం విదేశీ కంపెనీలు చైనా నుంచి వైదొలగడం ప్రారంభించాయి. నిష్క్రమించిన కంపెనీలు భారతదేశం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి. కొన్ని కంపెనీలు చైనా ఉంటూనే విస్తరణ ప్రారంభించాయి.ఇందులో భాగంగా ప్రముఖ తైవాన్ ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ ఇండియాలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి MoU చేసుకుంది . ఆపిల్, సామ్‌సంగ్, గూగుల్ వంటి కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు దృఢమైన అడుగులు వేస్తున్నాయి. రోడియం గ్రూప్ నివేదిక ప్రకారం భారతదేశంలో అమెరికా, యూరోప్ గ్రీన్‌ఫీల్డ్ ఇన్వెస్ట్‌మెంట్, 2021-2022లో 65 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే ఇది 400% పెరిగింది.ఇదే సమయంలో చైనాలోని ఇన్వెస్ట్‌మెంట్ 20 బిలియన్ డాలర్లకి పడిపోయింది. 2018లో చైనాలో ఇన్వెస్ట్‌మెంట్ 120 బిలియన్ డాలర్లు. ఈ నివేదిక ప్రకారం చైనా ఏ పరిస్థితులలో ఉందో అర్థంచేసుకోవచ్చు. చైనా అమలుచేస్తున్న నిరంకుశ విధానాలు ఆ దేశానికీ పెద్ద ఎదురుదెబ్బ . అందుకే వరల్డ్ ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్నాయి.ఎప్పుడైనా ప్రజాస్వామ్యం నిరంకుశత్వం కంటే చాలా గొప్పది.
2023 కచ్చితంగా ఇండియాదే అని చెప్పొచ్చు. అది చంద్రయాన్ మిషన్ లేదా G-20 సమ్మిట్ ప్రెసిడెన్సీ లేదా గ్లోబల్ ఆర్డర్ కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇండియా ఇతర దేశాలకు అందనంత ఎత్తుగా ఎదిగిపోతుంది అని చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు. ఈ విజయం డ్రాగన్ కంట్రీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. విస్తృత విధానాలు కాకుండా రక్షణాత్మకమైన విధానాలతో ఆచితూచి అడుగులు వేస్తుంది…