చైనా త‌న వ‌ద్ద ఉన్న బెలూన్ల‌తో చాలా దేశాల‌పై నిఘా..!!. అందులో భారత్ కూడా ఉంది…నిఘా బెలూన్ శ‌క‌లాల‌ ఫోటోల‌ను అమెరికా నౌకాద‌ళం రిలీజ్..

అమెరికా గ‌గ‌న‌త‌లంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను పేల్చివేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ నిఘా బెలూన్ శ‌క‌లాల‌ను యూఎస్ నేవీ సేక‌రించింది.. దానికి సంబంధించిన ఫోటోల‌ను అమెరికా నౌకాద‌ళం రిలీజ్ చేసింది. బోటులోకి భారీ స్థాయిలో బెలూన్ శిథిలాలను ఎక్కిస్తున్న ఫోటోల‌ను యూఎస్ ఫ్లీట్ ఫోర్సెస్ క‌మాండ్ త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది.సౌత్ క‌రోలినాలోని మిర్టిల్ బీచ్ వ‌ద్ద ఆ శ‌క‌లాల‌ను సేక‌రించారు…చైనా బెలూన్‌లో ఎటువంటి నిఘా ఎక్విప్మెంట్ ఉందో ఆ శిథిలాల ఆధారంగా అమెరికా నిపుణులు అంచ‌నా వేయ‌నున్నారు. బెలూన్ దాదాపు 60 మీట‌ర్ల ఎత్తులో ఎగిరింద‌ని, దాంట్లో ఓ విమానంలో ఉన్నంత పేలోడ్ ఉంద‌ని, ఇక అది వేల పౌండ్ల బ‌రువు ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నార్ధం ఆ బెలూన్‌ను రిలీజ్ చేశామ‌ని, కానీ అది అనుకోకుండా అమెరికా వైపు వెళ్లిన‌ట్లు చైనా చెబుతోంది…అమెరికా గ‌గ‌న‌త‌లంలో బెలూన్ క‌నిపించిన త‌ర్వాత‌.. ఆ దేశానికి చైనాకు మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన వివాదాలు త‌లెత్తాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ త‌న చైనా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఉత్తర అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఉన్న సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్‌ను గుర్తించినట్టు పెంటగాన్‌ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్‌ సంచరించడంతో అమెరికా తీవ్రంగా పరిగణించింది. దీంతో చైనా నిఘా బెలూన్‌ను అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాల మేరకు దేశ తూర్పుతీరంలో కూల్చివేసినట్లు పెంటగాన్‌ ప్రకటించింది…

చైనా త‌న వ‌ద్ద ఉన్న బెలూన్ల‌తో చాలా దేశాల‌పై నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. డ్రాగన్ దేశ బెలూన్లు ఇండియాను కూడా టార్గెట్ చేసిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం వెల్ల‌డించింది. కొన్ని రోజుల క్రితం అమెరికా గ‌గ‌న‌త‌లంలో ఎగురుతున్న చైనా బెలూన్‌ను ఆ దేశం పేల్చివేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ మిత్ర దేశాల‌కు అగ్ర‌రాజ్యం అమెరికా కొన్ని ర‌హ‌స్య అంశాల‌ను తెలియజేసింది. ఆ మీటింగ్‌లో ఇండియాతో పాటు సుమారు 40 దేశాల‌కు చెందిన ఎంబ‌సీ అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షేర్‌మాన్ వాషింగ్ట‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో అనేక విష‌యాల‌ను వెల్ల‌డించారు..చైనా నిఘా బెలూన్ అనేక సంవ‌త్స‌రాల పాటు హైన‌న్ ప్రావిన్సులో ఆప‌రేష‌న్‌లో ఉంది. అనేక దేశాల సైనిక స‌మాచారాన్ని ఆ బెలూన్లు సేక‌రించిన‌ట్లు అమెరికా తెలిపింది. జ‌పాన్‌, ఇండియా, వియ‌త్నాం, తైవాన్‌, పిలిప్పీన్స్‌లో ఉన్న వ్యూహాత్మ‌క కీల‌క ప్రాంతాల‌ను ఆ బెలూన్లు టార్గెట్ చేసిన‌ట్లు ద వాషింగ్ట‌న్ పోస్టు త‌న క‌థ‌నంలో చెప్పింది. ర‌క్ష‌ణ‌, ఇంటెలిజెన్స్ అధికారుల‌తో నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూల ఆధారంగా ఆ రిపోర్టును త‌యారు చేశారు.

పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీలోని వైమానిక ద‌ళం ఆ నిఘా బెలూన్ల‌ను ఆప‌రేట్ చేస్తోంద‌ని, ఇవి అయిదు ఖండాల‌పై క‌నిపించిన‌ట్లు ఆ కథ‌నంలో తెలిపారు. నిఘా వ్య‌వ‌హారాల కోసం ఇలాంటి బెలూన్ల‌ను చైనా త‌యారు చేసింద‌ని, ఇత‌ర దేశాల సార్వ‌భౌమ‌త్వాన్ని ఉల్లంఘించిన‌ట్లు ఓ సీనియ‌ర్ ర‌క్ష‌ణ అధికారి తెలిపారు. ఇటీవ‌ల స‌మ‌యంలో హ‌వాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువామ్‌ల‌పై నాలుగు బెలూన్లు క‌నిపించిన‌ట్లు ఆ క‌థనంలో వెల్ల‌డించారు…