చేనాలో ఘోర అగ్నిప్రమాదం..26 మంది మరణం..60 మంది తీవ్రంగా గాయాలు…..

చేనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. లులియాంగ్లోని ఓ కోల్ మైన్లో జరిగిన ప్రమాదంలో 25 మంది చనిపోయినట్టు ప్రస్తుత సమాచారం…
ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలోని ఐదు అంతస్తుల భవనంలో ఓ ప్రైవేట్ బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం 7 గంటల ప్రాతంలో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది మరణించారు.60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు…

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. చైనా భారీ అగ్నిప్రమాదాలకు కేంద్రంగా మారింది. హై రైజ్ అపార్ట్‌మెంట్లలో తరుచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది నవంబర్ నెలలో అన్యాంగ్ నగరంలోని ఓ కార్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించి 38 మంది దుర్మరణ పాలయ్యారు. అంతకుముందు ఏడాది అక్టోబర్ నెలలో షెన్‌యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. 2015లో టింజిన్ లోని రసాయన గోదాముల్లో జరిగిన వరస పేలుళ్లలో 175 మంది చనిపోయారు. ఇక చైనాలోని బొగ్గు గనుల్లో అగ్నిప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి.