చైనా మాంజా దారం మెడకు కోసుకుని ఆరేళ్ల చిన్నారి కీర్తి తీవ్రంగా గాయలు…

*ఎల్ బి నగర్‌‌లో బైక్‌పై వెళ్తున్న కుటుంబానికి చుట్టుకున్న చైనా మాంజా…*

4 ఏండ్ల చిన్నారి మెడకు చుట్టుకుని తీవ్రగాయాలు…

పాప పరిస్థితి విషమం…

హాస్పిటల్‌కి తరలించిన తల్లిదండ్రులు…

నాగోల్‌ ఫ్లై ఓవర్‌‌పై ఘటన..

హైదరాబాద్ నాగోల్లో విషాదం జరిగింది. చైనా మాంజా దారం మెడకు కోసుకుని ఆరేళ్ల చిన్నారి కీర్తి తీవ్రంగా గాయపడింది. సంక్రాంతి పండగ కోసం సొంతూరుకు బయలుదేరిన ఓ కుటుంబం.. నాగోల్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా.. చైనా మాంజా దారం కీర్తి మెడకు చుట్టుకుంది. చిన్నారి గట్టిగా అరవడంతో తండ్రి బైక్ను ఆపి చూడగా..అప్పటికే చిన్నారి మెడ కోసుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పాపను పరిశీలించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

చైనా మంజా చాలా ప్రమాదకరమైందని, దాన్ని ఉపయోగించకూడదని పోలీసులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. చైనా మాంజా విక్రయించిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకున్నారు. కానీ, కొంతమంది వ్యాపారులు చైనా మాంజాలను విక్రయిస్తున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా జనం వీటి వైపే మొగ్గు చూపుతుండడం ఆందోళన కల్గిస్తోంది.