పసిఫిక్ మహాసముద్రంలో కూలిన చైనా లాంగ్ మార్చ్ రాకెట్ (సీజెడ్-5బీ)..!!

ప్ర‌పంచ జ‌నాభాని భ‌య‌పెట్టించిన‌ చైనా లాంగ్ మార్చ్ రాకెట్ (సీజెడ్-5బీ) పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దీని శకలాలను మెక్సికన్ తీరంలో గుర్తించారు. ఈ రాకెట్ తొలుత స్పెయిన్ పై కూలిపోతుందని భావించినా, అదృష్టవశాత్తు పసిఫిక్ జలాల్లో పడిపోయింది…

చైనా రాకెట్ (సీజెడ్-5బీ) పసిఫిక్ లో కూలిపోయినట్లు, శకలాలను మెక్సికన్ తీరంలో గుర్తించినట్లు అమెరికా స్పేస్ కమాండ్ నిర్ధారించింది. పసిఫిక్ జలాల్లో కూలిపోయింది.
చైనా రాకెట్లు ఇలా భయాందోళనలు కలిగించడం రెండేళ్లలో ఇది నాలుగోసారి కాగా, చైనా నిర్లక్ష్య వైఖరిపై ప్రపంచదేశాలు మండిపడుతున్నాయి.