చైనా సైనిక ప‌రిశోధ‌కులు భారీ ప్లాన్….స్టార్‌లింక్ శాటిలైట్ల విధ్వంసానికి చైనా సైంటిస్టుల ప్ర‌ణాళిక‌..!!!!!

చైనా సైనిక ప‌రిశోధ‌కులు భారీ ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ త‌మ దేశ భ‌ద్ర‌త‌కు స్టార్‌లింక్ శాటిలైట్ల‌తో ప్ర‌మాదం ఏర్ప‌డితే, వాటిని నిర్వీర్యం చేసేందుకు కావాల్సిన టెక్నాల‌జీ సామ‌ర్థ్యాన్ని అభివృద్ధి చేసే ప‌నిలో చైనా ఉన్న‌ట్లు ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు దీనికి సంబంధించిన స్ట‌డీని ప్ర‌చురించింది. ప్ర‌తి ఒక్క స్టార్‌లింక్ శాటిలైట్‌ను ట్రాక్ చేసి మానిట‌ర్ చేసేందుకు కావాల్సిన నిఘా వ్య‌వ‌స్థ‌ను డెవ‌ల‌ప్ చేయాల‌ని చైనా మిలిట‌రీ సైంటిస్టులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆ క‌థ‌నంలో వెల్ల‌డించారు. రెన్ యువాన్‌జెన్ నేతృత్వంలో ఆ స్ట‌డీ సాగిన‌ట్లు తెలుస్తోంది. స్టార్‌లింక్‌ను ఢీకొట్టేందుకు చాలా సున్నిత‌మైన‌, క‌చ్చిత‌మైన టెక్నాల‌జీని చైనా డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు క‌థ‌నంలో పేర్కొన్నారు…