15 అడుగుల పొడవు, 2500 కేజీల చాక్లెట్ గణేష్ డు.., 108 రకాల స్వీట్స్,…

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఈ చాక్లెట్
గణేష్ అందరినీ ఆకర్షిస్తున్నాడు. జాగ్లోని
నోవాటెల్ హోటెల్ ఎదురుగా 2500 కిలోల చాక్లెట్ వినాయకుడిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చాక్లెట్ కరిగిపోకుండా మండపంలో ఏసీలు అమర్చారు. నవరాత్రుల తర్వాత గణనాథుడిని పాలతో అభిషేకం చేసి ప్రసాదంగా పంచుతారని తెలుస్తోంది.

15 అడుగుల పొడవు, 2500 కేజీల చాక్లెట్, 108 రకాల స్వీట్స్, అది కూడా కోవాతో చేసిన పసందైన మిఠాయిలు.. ఇవన్నీ వింటుంటే ఏదో స్వీట్స్ ఫెస్టివల్ గురించి చెపుతున్నాం అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు చాక్లెట్ లో కాలేసినట్లే. ఎందుకంటే ఇదంతా విశాఖలో చాక్లెట్ గణపతి ప్రత్యేకత. విశాఖ బీచ్ రోడ్డులో చాక్లెట్ వినాయకుడు కొలువుతీరాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2500 కేజీల చాక్లెట్లతో ఈ వినాయకుడిని తయారు చేశారు. ప్రస్తుతం ఈ గణపయ్య పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకర్షిస్తోంది.విశాఖ సాగరతీరంలో లక్ష్మణ్ అనే నావికాదళ ఉద్యోగి.. ప్రతి ఏడాది ఏకో ఫ్రెండ్లీ వినాయకుల్ని ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హిత గణపయ్యను ప్రతిష్టించి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలన్నది లక్ష్మణ్ ఆలోచన. ఆయన భావాలకు తగ్గట్టు ఆయన సొదరుడు రాజు ప్రతి సారి కొత్త ఆలోచనతో ముందుకు వస్తుంటారు. ఈ సారి చాక్లెట్ గణపయ్యను ప్రతిష్టించాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ఇది సోదరుడికి చెప్పడంతో ఈ చాక్లెట్ వినాయకుడి విగ్రహం తయారీకి తొలిఅడుగు పడింది…

ఖైరతాబాద్ గణేష్ ని స్ఫూర్తితో ఏదైనా స్పెషల్ గా ఉండాలి అని ఒక చిన్న ఉద్దేశంతో చాక్లెట్ గణేష్ వీడిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.. ఇకపై కూడా వినూతన రీతిలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసే వైజాగ్ ప్రత్యేకతలు అందరికీ తెలిసేలా చేస్తానని అన్నారు…