టాలీవుడ్ లో మరో విషాదం.. చలపతిరావు కన్నుమూత..

టాలీవుడ్ లో వరుస విషాదాలు
గుండెపోటుతో చలపతిరావు మృతి
1,200కు పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు

టాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నారు. సీనియర్ నటుడు చలపతిరావు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. 1,200కు పైగా సినిమాలలో చలపతిరావు నటించారు. కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944లో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ మృతి వార్తలో టాలీవుడ్ షాక్ కు గురైంది. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటల కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.