మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఇది భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉన్నప్పటికీ దీని ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కుంభ రాశిలోని శతభిషా నక్షత్రంలో రవి, రాహువులు, సింహ రాశిలోని మఖా నక్షత్రంలో చంద్ర, కేతువులు కలవడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతున్నందువల్ల కొన్ని రాశుల వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మీన రాశులవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ గ్రహణ ప్రభావం 4వ తేదీ మీద కూడా ఉంటుంది. వీరు ఆదిత్య హృదయాన్ని, విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ఎక్కువ పర్యాయాలు పఠించడం మంచిది…మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఏర్పడుతున్నందువల్ల అవమానాలకు, అపనిందలకు బాగా అవకాశం ఉంది. ప్రయాణాల్లో గానీ, ఇంట్లో గానీ విలువైన వస్తువులు కోల్పోవడం జరుగుతుంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తి, గృహ ఒప్పందాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది.దృక్ సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రగ్రహణం 2026 మంగళవారం రోజు పుబ్బ నక్షత్రం నందు సింహరాశిలో సంభవించనుంది. తెలుగు సంవత్సరమైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంభవించే చివరి చంద్రగ్రహణం ఇదే. ఇది పాక్షిక చంద్రగ్రహణం అయినా కూడా సూతక కాలం, ఆలయాల మూసివేత, పవిత్ర స్నానాలు, గ్రహణ శాంతలు వంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని పండితులు చెబుతున్నారు..
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి శివాలయం, అరుణాచల క్షేత్రం ప్రధానమైనవి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడం కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని ప్రగాఢ నమ్మకం.
మన పురాణాల ప్రకారం దక్షిణ కాశిగా పిలువబడే శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు, అగ్నిభట్టారడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ శివ క్షేత్రానికి రాహువు, కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం.