నటుడు చంద్రమోహన్ మృతికి పలువురు ప్రముఖుల ప్రగాఢ సానుభూతి..!

ప్రముఖ నటులు చంద్రమోహన్‌ (Chandramohan) మృతిపట్ల మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు..ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవడం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు.
సోమవారం హైదరాబాద్ లో టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి.

కాగా, ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను చంద్రమోహన్ అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటని అన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంత చేసుకున్నారని తెలిపారు..
Chandramohan | ప్రముఖ నటులు చంద్రమోహన్‌ (Chandramohan) మృతిపట్ల మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవడం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు. ప్రాణం ఖరీదు సినిమా సందర్భంగా ఆయనతో ఏర్పడిన తొలి పరిచయం ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

‘సిరిసిరిమువ్వ, శంకరాభరణం, రాధాకళ్యాణం, నాకూ పెళ్ళాం కావాలి.. లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం..

చంద్రమోహన్ మృతి బాధాకరమని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఆయన తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు..
నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’ అని చిరంజీవి అన్నారు.
చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు బాలకృష్ణ.
చంద్రమోహన్‌ మృతి తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు- ఏపీ నాయకులు

AP Politicians Condoled the Death of Chandramohan: సీనియర్​ నటుడు చంద్రమోహన్​ కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు… పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.. నారా లోకేష్ ఓ గొప్ప మహనీయ నటుడిని కోల్పోయినట్లుగా తెలిపారు.. వారి వృత్తి చాలా బాధాకరమని అన్నారు..

మరోవైపు చంద్రమోహన్‌ మృతి చెందారని తెలిసి బాధపడ్డానని ప్రముఖ నటుడు వెంకటేశ్‌ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చంద్రమోహన్‌ మృతికి సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన సినిమాల్లో తనదైన నటనతో ముద్ర వేశారన్నారు. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.