చంద్రబాబు హెలిప్యాడ్‌ వద్ద సిగ్నల్‌ బజర్‌..తీరా చూస్తే అది ఇనుప ముక్క!..

హెలికాఫ్టర్‌ దిగాల్సిన హెలిప్యాడ్‌ వద్ద సిగ్నల్‌ బజర్‌ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అతలాకుతలం అయ్యారు. ఈ క్రమంలో.. బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. తీరా చూస్తే అది ఇనుప ముక్క!.

చింతలపూడిలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నిర్మాణం వద్ద సిగ్నల్‌ బజర్‌ మోగిందట. దీంతో.. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే అక్కడ ఇనుప ముక్క ఉండడం వలన బజర్ మోగినట్లు పోలీసు అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇనుప ముక్క బయటకు వచ్చింది తప్ప మరి ఇతర వస్తువులు లేవని బాంబ్స్ స్క్వాడ్ నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.