భీమ్లా నాయక్‌ సినిమాపై జగన్‌ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోంది: చంద్రబాబు.

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్‌ మంచి టాక్‌తో నడుస్తుంది…విడుదలైన అన్ని చోట్ల సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. విదేశాల్లోనూ భీమ్లా నాయక్‌ మంచి టాక్ తెచ్చుకుంది..
భీమ్లా నాయక్‌’ ప్రదర్శనల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ సినిమా షోలకు అనుమతి లేదు. భీమ్లా నాయక్‌ విడుదల నేపథ్యంలో.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తారేమోనన్న ఉద్దేశంతో ఏపీలోని పలు థియేటర్ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు పహారా కాచారు. ఇందుకు సంబందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఆంక్షలపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌ స్పందించగా.. తాజాగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.

చంద్రబాబు నాయుడుతో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ భీమ్లా నాయక్‌ చిత్రంపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని టార్గెట్‌ చేస్తూ పలు రకాల నిబంధనలు విధించిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, లోకేష్.. భీమ్లా నాయక్‌ చిత్రంపై ట్విట్టర్‌ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ వీరు ఏమన్నరాంటే….
జగన్‌ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోంది: చంద్రబాబు
భీమ్లా నాయక్‌ చిత్రంపై వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని ఆరోపించిన టీడీపీ అధినేత చంద్రబాబు..జగన్‌ చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది… నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.