మరో 14 రోజులు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు..
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా 14 రోజులు రిమాండ్ ఆదేశించింది. కస్టడీ నేపథ్యంలో రిమాండ్ పొడిగించింది. ఈ లోపు మరిన్ని కేసులు వెంటాడడంతో నేటి వరకూ జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈరోజు ప్రస్తుతం వాదనలు విన్న తర్వాత మరో 14 రోజులు రిమాండ్ విధించింది..
ఈనెల 19 వరకు చంద్రబాబు జైల్‌లో ఉండాల్సిందేనని న్యాయస్థానం వెల్లడించింది. అయితే.. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించిన సంగతి తెలిసిందే. మొదట న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా.. ఆ గడువు ముగిశాక మరో రెండు రోజుల పాటు పొడిగించింది. ఆ గడువు కూడా సెప్టెంబర్ 24తో ముగియగా.. మళ్లీ 11 రోజులు అంటే అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించింది. ఆ గడువు కూడా ఈరోజుతో ముగియగా.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మరో 14 రోజుల పాటు రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో.. ముచ్చటగా.. మూడోసారి కూడా రిమాండ్ పొడిగించినట్టయింది
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు ఈ నెల 19 వరకు రిమాండ్ విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది.