చంద్ర గ్రహణం.. రేపు శ్రీవారి ఆలయం మూసివేత…!

చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 వరకు 11 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఆరోజు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని, సోమవారం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తితిదే తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. దీంతో శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను అనుమతిస్తుంది. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తిరుమలలో అన్నప్రసాద వితరణ ఉండదు.