కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్..

మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే,, రేవంత్ రెడ్డి సమక్షంలో చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు…ఈ నెల 13న మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రశేఖర్ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్, బీజేపీలలో పనిచేశారు. బీజేపీకి ఈ నెలలోనే రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు..కాగా ఈ నెల 26న చేవెళ్లలో జరిగే సభపై వారు చర్చించనున్నారు. ముఖ్యంగా పార్టీలో చేరికలు, దళిత, గిరిజన డిక్లరేషన్‌పై ఖర్గేతో నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది…

అనంతరం మాజీ మంత్రి చంద్రశేఖర రావు మీడియాతో మాట్లాడుతూ… బి ఆర్ ఎస్ పార్టీని ఓడించేది కేవలం కాంగ్రెస్ పార్టీనే… ఆ సత్తా కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది…