జాబిల్లి ఉపరితలంపై రోవర్ అటూఇటూ తిరిగినా సురక్షిత మార్గంలోనే ప్రయాణం..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన ల్యాండర్, రోవర్ తమ పనిలో నిమగమ్నమయ్యాయి. చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ పూర్తిచేయాల్సిన పరిశోధనల లిస్టు పెద్దగానే ఉంది.. దీంతో రోవర్ చంద్రుడిపై తమ పనులను చకచకా పూర్తిచేస్తోంది. ఈ క్రమంలో జాబిల్లి ఉపరితలంపై రోవర్ అటూఇటూ తిరుగుతూ సురక్షిత మార్గాన్ని ఎంచుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా ఇస్రో తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది…