చంద్రయాన్ 3 విజయవంతం.. దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన తొలి దేశం భారత్..

ఖగోళంలో భారత శాస్త్రవేత్తల అద్భుతం..

చంద్రయాన్ 3 విజయవంతం..
చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌.. స్కూళ్లు, కాలేజీల్లో లైవ్‌… చూస్తూ ఎంజాయ్ చేశారు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.. సెల్యూట్ ఇస్రా అంటూ కేరింతలు కొట్టిన విద్యార్థులు…
చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. ప్రయోగం విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ పై భారీ అంచనాల మధ్య ఈ ప్రయోగం జరిగింది. చంద్రుడిపై ప్రయోగాల్లో ఇక మనదే ఆధిపత్యం..

నరాలు తెగే ఉత్కంఠ మధ్య ల్యాండింగ్..
బండరాళ్లు, గుంటలు లేని ప్రదేశాన్ని చూసి సేఫ్ గా ల్యాండ్ అయిన విక్రమ్..
చంద్రుడు దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ దేశం….

దేశం మొత్తం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చంద్రయాన్త్రీ విజయవంతంగా ల్యాండ్ అయింది… ఉత్కంఠ భరితంగా ఎదురుచూసిన క్షణంలో ప్రతి ఒక్కరు కూడా వీక్షించడం జరిగింది….
దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది భారతదేశ…
అంతరిక్ష చరిత్రను కొత్త రికార్డు సృష్టించడం,, సుమారు 40 రోజులపాటు
విదేశాలను సైతం కూడా అపూర్వపరిచేలా సేఫ్టీ లాండింగ్ తో ఖగోళ భారత శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురి చేసేలా చంద్రుని దక్షిణ ధృవం పై దిగిన విక్రమ్ ల్యాండర్…

ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో శాస్త్రవేత్తలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 17 నిమిషాల పాటు ల్యాండింగ్ ప్రక్రియ కొనసాగింది…

Chandrayaan 3 Landed on Moon : జయహో భారత్.. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్

Chandrayaan 3 Landed on Moon : ప్రపంచంలో ఏ దేశం సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది భారత్. ఏ దేశం అడుగుపెట్టని చందమామ దక్షిణ ధ్రువాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 విజయం సాధించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెట్టగానే శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల యావత్ భారతదేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు…

చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ బుధవారం ప్రక్రియ ముగిసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటల్లోకి ఎక్కింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశం భారత్. సరిగ్గా సాయంత్రం గం.6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు…