చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3..ఇస్రోకి దాసోహమైన వరల్డ్ రికార్డ్..

*న్యూఢిల్లీ చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan-3) భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ని (Vikram lander) సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించింది..

వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ని ఒకే చేయండి..
https://youtube.com/shorts/JVfZOC1LEYA?si=dR3fUXwzl2eN9pIj.

జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ అద్భుత విజయాన్ని సమస్త భారతావని వేడుకలా జరుపుకుంది. ప్రపంచదేశాలు సైతం జయహో భారత్ అని కీర్తించాయి. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. టీవీల ముందు అతుక్కుపోయినవారు కొందరైతే.. యూట్యూబ్‌లో వీక్షించినవారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ఇస్రో యూట్యూబ్‌లో ప్రపంచ రికార్డ్ సృష్టించింది..