నేటి నుండి చేరువుగట్టు జాతర ప్రారంభం…

నల్లగొండ జిల్లా..

చేరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుతున్నాయి ఉత్సవాలలో భాగంగా నేడు అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా జరిగింది
అగ్నిగుండాల కార్యక్రమంలో ముందుగా స్వామి అమ్మవార్ల గరుడ వాహనం పై ఆలయ పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం భగభగ మండే నిప్పుల కనుకల మీద నుంచి నడిచి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు..

అగ్నిగుండాల పై నడుస్తే భూతపేట పిచాచ పీడలు వదులుతాయని, అనారోగ్య సమస్యలు తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల అపార నమ్మకం…

వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు పోలీస్ సిబ్బంది అన్న ఏర్పాట్లు చేశారు…