చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు..

కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ.. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వంలో నిర్వహిస్తున్న చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి.

*కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం.. ఈనెల 13న చలో నల్గొండ..

*కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అవగాహన రాహిత్యంతో కేంద్ర ప్రభుత్వ కృష్ణా రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డుకు అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం…

ఎమ్మెల్సీ రవీందర్రావు.. బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,,.

కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకిస్తూ.. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వంలో నిర్వహిస్తున్న చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ రవీందర్రావు,,కోదాడ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..
లు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చలో నల్గొండకు సంబంధించిన వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ.. కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నల్లగొండలో చలో నల్గొండ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ బహిరంగ సభకు కోదాడ నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. మన నీళ్ల కోసం మన హక్కుల కోసం మనందరం కలిసి కెసిఆర్ నాయకత్వంలో పోరాడుదాం అని తెలిపారు . ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు , పార్టీ నాయకులు , గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని స్థాయిల పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు నాయకులు , తదితరులు పాల్గొన్నారు.