చెరుకు రసం మంచిదే..ఇవి కూడా చూసుకోండి…

నోటిలో కావిటీస్, నోటి దుర్వాసన నివారణ..

చెరుకు రసం మంచిదే..ఇవి కూడా చూసుకోండి.

వేసవి కాలంలో చాలా మంది చేరుకు రసం తాగేందుకు ఇష్టపడుతారు. అయితే చెరుకు రసం తీసే మిషన్,పరిసరాల శుభ్రత గమనించాలి. కొన్నిచోట్ల మిషన్ లోని ఆయిల్,గ్రీజ్..రసంతో పాటు గ్లాసుల్లో పడుతాయి. దీనివల్ల వ్యాధుల భారిన పడే ప్రమాదముంది. ఇక చేరుకుతో పాటు అల్లం,నిమ్మకాయ కలిపి రసంలా చేస్తే ఆరోగ్యానికి మంచిది. రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ కంటె చేరుకు రసం తాగడం మేలు….
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు చాలా మంది చెరుకు రసాన్ని తాగుతారు. అయితే చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి…

తక్షణ శక్తి…

చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. మీరు అధిక వేడితో అలసిపోయినా.. మీ శరీరంలో నీటి కొరత ఉన్నట్లు అనిపించినా.. చెరకు రసం మీకు ఉత్తమ ఎంపిక…
చెరకు రసం కామెర్లు చికిత్సలో ఉపయోగిస్తారు. ఎందుకంటే చెరుకు రసం కాలేయాన్ని (లివర్ స్ట్రాంగ్) బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది ఎల్లో ఫీవర్‌ను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.

నోటిలో కావిటీస్, నోటి దుర్వాసన నివారణ.

చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది. తద్వారా వాటికి పురుగులు, దంతాలలో పుచ్చులు ఉండవు. చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది….

మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది

చెరకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించేవారు చెరుకు రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది. అంతే కాకుండా.. చెరుకు రసం మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది. ..