గుండెపోటుతో చెస్ సీనియర్ క్రీడాకారుడు మృతి..

తెలంగాణ చెస్ క్రీడాకారుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సీనియర్ క్రీడాకారుడైన ఆ వ్యక్తి చేస్ గేమ్ ఆడుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్ర, శని, ఆదివారాల్లో స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు.

దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన 700 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలకు హైదరాబాదులోని అంబర్ పేట్‌లో ఉండే సాయి (72) అనే సీనియర్ చెస్ క్రీడాకారుడు శనివారం మధ్యాహ్నం వచ్చారు. ఆ టోర్న మెంట్‌లో ఆయన కూడా పాల్గొని ఆడుతున్నారు.

గేమ్ మధ్యలోనే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు….