చేతికి కంకణం ఎందుకు..!!?

*చేతికి కంకణం ఎందుకు?*

🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀.

సాధారణంగా మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు లేదా నోములు, వ్రతాలు చేసేటప్పుడు చేతికి కంకణం కట్టుకోవడం చూస్తుంటాము.అదేవిధంగా ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా చేతికి కంకణం కడతారు. అయితే ఈ విధంగా చేతికి కంకణం కట్టడానికి గల కారణం ఏమిటి? కంకణం కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
చేతికి కంకణం కట్టుకునే సమయంలో చేతిలో ఏదైనా పుష్పాన్ని లేదా పండు పట్టుకొని కట్టుకోవాలి. ముఖ్యంగా కొబ్బరికాయను చేతిలో పట్టుకుని కంకణం కడతారు. కంకణం చేతికి కట్టుకునేటప్పుడు మనలో దృఢమైన సంకల్పం ఉండాలి. చేతికి కంకణం కట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఆడవారు కంకణాన్ని ఎడమ చేతికి మగవారి కుడిచేతికి కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు…

శ్రీ వరలక్ష్మీ వ్రతం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, గౌరీపూజ, వివాహం వంటి శుభకార్యాల్లోను, యజ్ఞయాగాదుల్లోను చేతికి కంకణం కట్టుకోవడం ఆచారం.

పురుషులకు కుడిచేతికి, స్త్రీలకు ఎడమచేతికి కంకణం కట్టుకుంటారు. వారు చేసిన పూజాఫలం వారికి లభించేందుకు గాను, కంకణం ఉన్నంత వరకు మనసు అటు ఇటు పోకుండా పూజ చేసాను అనే భావన మనస్సులో తొలగిపోకుండా ఉంటుందని పెద్దలు చెబుతారు.

నూలుదారానికి పసుపు రాసి ముంజేతికి మణికట్టుకు కడతారు.

కంకణాన్ని తోరం అని కూడా అంటారు.

కంకణధారణ వల్ల ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు శరీరంలోని జీవనాడుల్లో ముఖ్యనాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణం కట్టుకోవడం వలన ఆ భాగంలో కలిగే ఒత్తిడి, రక్తప్రసరణలతో పాటు హృదయస్పందన కూడా లయబద్ధంగా క్రమపద్ధతిలోకి వస్తుంది. అక్కడ ఉన్న నాడి గర్భాశయం వరకు ఉంటుంది. అందుకే నిపుణులైన వైద్యులు స్త్రీల చేతినాడిని పరీక్షించి గర్భవతా కాదా అనే విషయం చెప్పగలరు.

అంతటి విశిష్టత కలిగిన చేతిలో గల జీవనాడుల ఉద్దీపన కొరకు పూజా సమయాల్లో కంకణం ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతోంది…కంకణము కట్టుకొనుట ఆచారము. పురుషులకు కుడి చేతికి, స్త్రీలకూ ఎడమ చేతికి కంకణము కడతారు. చేసిన పూజ ఫలం, భావనా తొలగిపోకుండా, ఆ కంకణం ఉన్నంత వరకూ అదే భావన, ప్రశాంతత ఆ కంకణము కట్టుకొనుట వలన సిద్దిస్తుంది. నూలుదారానికి పసుపు రాసి ముంజేతి మణికట్టుకు కడతారు. కంకణ ధారణవల్ల ఆధ్యాత్మికమైన ఈ ప్రయోజనంతో పాటు మరో ప్రయోజనము కూడా ఉంది. ఆహారీరంలోని జీవ నాడుల్లో ముఖ్య నాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణము కట్టుకోవడం వల్ల ఆ భాగంలో కలిగే ఒత్తిడి, రక్త ప్రసరణతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోకి వస్తుంది. అక్కడ ఉన్న నాది గర్భాశయం వరకూ ఉంటుంది. అందుకే నాది పట్టుకొని చూసి ఓ స్త్రీ గర్భవతా, కాదా అని కూడా చెప్పగలరు. అంతటి విశిష్టత కలిగిన ఆ స్థానంలోని జీవనాడుల ఉద్దీపన కొరకు పూజా సమయాల్లో కంకణం ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతుంది..

*శుభంభూయాత్*