చత్తీస్ ఘడ్ జిల్లాలో ఎన్ కౌంటర్..ఇద్దరు మహిళా నక్సల్స్ మృతి.

*చత్తీస్ ఘడ్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా నక్సల్స్ మృతి*

దంతేవాడ-సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతం బుధవారం కాల్పులతో దద్దరిల్లింది.

పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సల్స్ మరణించారు. దర్బా డివిజనల్ క్యాడర్ కు చెందిన మావోయిస్టులు నాగారం పోరో హిర్మా అడవుల్లో సమావేశం అయి ఉన్నట్లు అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేస్తూ అక్కడికి వెళ్లాయి. పోలీసులను చూడగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు.

దీనికి ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు. దాదాపు గంటపాటు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులు అడవుల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు తనిఖీలు జరుపగా ఇద్దరు మహిళా నక్సల్స్ మృతదేహాలు దొరికాయి. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఇన్సాస్ రైఫిల్,12 బోర్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా కమర్ గూడ,జగర్ గుండా రోడ్డులో సీఆర్పీఎఫ్ పోలీసులను టార్గెట్ చేసి మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చారు. దీంట్లో 231 బెటాలియన్ కు చెందిన ఓ సీఆర్పీఎఫ్ ఏఎస్ఐకి గాయాలయ్యాయి…