చట్నీస్ హోటల్‌కు బిగ్ షాక్..వైఎస్ షర్మిలకు షాక్.. వియ్యంకురాలుపై ఐటీ దాడులు.

ఎన్నికల ముందు ఐటీ దాడులు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం ప్రముఖల ఇళ్లతో పాటు, వారి వ్యాపార కార్యకలాపాలపై కూడా ఐటీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.ఈక్రమంలోనే ప్రముఖ హోటల్ సంస్థ చట్నీస్ హోటల్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని చట్నీస్ హోటల్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చట్నీస్ హోటల్‌ యాజమాని అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.
చట్నీస్ హోటల్‌ యాజమాని అట్లూరి పద్మ ,ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు స్వయంగా వియ్యంకురాలు అనే విషయం అందరికి తెలిసిందే. అట్లూరి పద్మ కూతురినే తన కొడుకు రాజారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు షర్మిల. హైదరాబాద్‌లో చట్నీస్ హోటల్స్‌కు ఓ బ్రాండ్ ఉంది. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. పదేళ్లుగా చట్నీస్ పేరుతో అట్లూరి పద్మ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు..మంగళవారం ఉదయం ఊహించని విధంగా చట్నీస్ హోటల్స్‌పై ఐటీ అధికారులు దాడులు చేయటం చేయడం వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఐటీ దాడులపై చట్నీస్ యాజమాన్యం కానీ, ఐటీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఐటీ దాడులు వెనుక రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో అన్న జగన్ ఓటమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారు.

ఈక్రమంలో షర్మిల వియ్యంకురాలు అట్లూరి పద్మపై ఐటీ దాడులు జరగడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు సిటీలోని మేఘనా ఫుడ్స్ అండ్ ఈటరీస్ లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ మేఘనా ఫుడ్స్‌కు ఫ్రాంచైజీలు ఉన్నాయి. చట్నీస్, మేఘనా ఫుడ్స్‌లలో జరుగుతున్న సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..