గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ప్రాణం వదిలిన వ్యక్తి …!

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ప్రాణం వదిలిన వ్యక్తి

హైదరాబాద్ – షాద్ నగర్ పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్(39) తన సోదరిని కలిసేందుకు వచ్చి కోఠిలోని ఓ వైన్స్‌లో మద్యం తాగి, చికెన్ బిర్యానీ తిన్నాడు.

తినే క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో శ్వాస ఆడక రోడ్డు పక్కన కుప్పకూలి చనిపోయాడు…

హైదరాబాద్ (Hyderabad) లోని షాద్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (39) అనే వ్యక్తి తన సోదరిని కలిసేందుకు వచ్చి కోఠిలోని ఓ వైన్స్‌ (Wines) లో ఫూటుగా మద్యం తాగి ఆ తర్వాత చికెన్ బిర్యానీ (Chicken Biryani) తిన్నాడు. అయితే, మద్యం మత్తులో బిర్యానీని వేగంగా తినడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో (Swallowed Chicken Bone) శ్వాస ఆడక రోడ్డు పక్కన కుప్పకూలి చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.