చికెన్ లివర్ తినడం వల్ల ప్రయోజనాలు..!!

ఈ మధ్యకాలంలో చికెన్ ఇష్టపడని వారంటూ ఉండరు. ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.కానీ కొంతమంది చికెన్ బ్రెస్ట్ పీస్ తిన్నట్టు,చికెన్ లివర్ ని మాత్రం అంతగా ఇష్టపడరు.కానీ చికెన్ బ్రెస్ట్ పీస్ తినడం కన్నా,చికెన్ లివర్ తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆహార నిపుణులు.దీనిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే కచ్చితంగా ఈసారి లివర్ తెచ్చుకొని మరీ తింటారు……
చికెన్ లివర్ లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మటన్ లివర్ కన్నా చికెన్ లివర్ లో అనేక రకాల పోషకాలు ఉండి మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుందని నిపుణులు వెల్లడించారు…

చికెన్ లివర్ ఫ్రై లాగా కాకుండా కొంత మోతాదులో ఉడికించి తినటం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. అంతేకాకుండా చికెన్ లివర్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలోని రక్తాన్ని సిద్ధపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది..
చికెన్ లివర్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఐరన్ అనేది మన శరీరాలు ఆక్సిజనేటెడ్‌గా ఉండటానికి సహాయపడేందుకు ముఖ్యమైనది.ఇది రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు.మరి ముఖ్యంగా గర్భం దాల్చిన వారికి తగిన మోతాదులో లివర్ ఇవ్వడం వల్ల వారి పోలిక్ యాసిడ్ పెరిగి, రక్తహీనత తగ్గుముఖం పడుతుంది…చికెన్ లివర్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు కి సంబంధించిన వ్యాధులు నియంత్రించి కంటి చూపు మెరుగు పడేలా చేస్తుంది. అంతేకాకుండాషుగర్ వ్యాధితో బాధపడేవారు చికెన్ లివర్ తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది

చికెన్ బ్రెస్ట్ పీస్ తో చికెన్ లివర్ ని కంపేర్ చేసినప్పుడు చికెన్ లివర్ లో తక్కువ క్యాలరీలు ఉంటాయి.మరియు అధిక ప్రోటీన్ ఉంటుంది.దీనితో తొందరగా పొట్ట నిండిన భావన కలిగి తక్కువ తింటారు.దీనిని తరచూ తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.

చికెన్ లివర్ లో సెలీనియం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల క్యాన్సర్, కీళ్ల నొప్పులు, నులిపురుగుల సమస్య, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..

అంతేకాక ఇందులో యాంటీవైరల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ అమైనో యాసిడ్ లైసిన్‌లో పుష్కలంగా లభిస్తాయి. దీనితో పాటు చికెన్ లివర్‌లో కొన్ని బి విటమిన్లు లభించి గర్భిణీలు,తల్లులు, పెరుగుతున్న పిల్లలలో ప్రో-మెటబాలిక్ శక్తి యొక్క అదనపు బూస్ట్ అవసరమయ్యే ఎవరికైనా ఇది సహాయకరంగా ఉంటుంది…దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, చికెన్ కాలేయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.3.5 ఔన్సుల చికెన్ కాలేయంలో 12 మైక్రోగ్రాముల K2 లభిస్తుంది.మరియు విటమిన్ సి,ఎ పుష్కలంగా దొరుకుతాయి.దీనిని తరుచూ తీసుకోవడంతో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.కళ్ళు,చర్మం,జుట్టు మరియు గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ ఏ అద్భుతంగా పనిచేస్తుంది.

కానీ గర్భిణీ స్త్రీలు దీనిని మోతాదులో మాత్రమే తీసుకోవాలి.లేకుంటే విటమిన్ ఏ అధికంగా లభించి పిల్లలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది…