తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు…పిల్లలతో పని చేయిస్తే.. ఏడాది జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా…

: బాల కార్మిక వ్యవస్థను రూపుమాపే దిశ‌గా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల‌లోపు చిన్నారుల‌తో ప‌ని చేయించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఒక వేళ 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పని చేయించుకుంటే… 6 నెలల నుంచి ఏడాది జైలు శిక్ష‌ విధిస్తామ‌ని తెలిపింది. అంతేకాదు రూ.20 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులే అని చెప్పింది.
Child Labour : బాల కార్మిక వ్యవస్థను రూపుమాపే దిశ‌గా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల‌లోపు చిన్నారుల‌తో ప‌ని చేయించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఒక వేళ 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పని చేయించుకుంటే… 6 నెలల నుంచి ఏడాది జైలు శిక్ష‌ విధిస్తామ‌ని తెలిపింది. అంతేకాదు రూ.20 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులే అని చెప్పింది.