చైనాకు చెందిన ఓ కంపెనీని పాకిస్థాన్‌ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో చేర్చింది….

చైనా కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టిన పాకిస్థాన్‌.

చైనాకు చెందిన ఓ కంపెనీని పాకిస్థాన్‌ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో చేర్చింది. ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్పాచ్‌ కంపెనీ(ఎన్‌టీడీసీ) టెండర్లకు ఆహ్వానించగా.. సదురు చైనా కంపెనీ నకిలీ పత్రాలతో టెండర్‌ వేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆ కంపెనీని బ్లాక్‌లిస్టులో చేర్చి నెలరోజులపాటు ప్రభుత్వ ప్రాజెక్టులో టెండర్‌ వేయకుండా నిషేధించారు. అయితే, ఆ కంపెనీ వివరాలను పాక్‌ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. పాక్‌.. చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి. అనేక అంశాల్లో ఇరు దేశాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన కంపెనీని పాక్‌ బ్లాక్‌లిస్టులో పెట్టడం గమనార్హం.