తైవాన్ భూభాగంపై చైనా దాడికి సన్నాహాలు..!!
తైవాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ డెవలయాంగ్‌ప్‌మెంట్ యూనిట్ డిప్యూటీ హెడ్ ఒయు లి-హిసింగ్ అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు...
అమెరికా చాలా కాలం తర్వాత.. అమెరికా-చైనా మధ్య తైవాన్ అంశం అగ్గి రాజేసింది. తైవాన్ విషయంలో.. అగ్రరాజ్యం, డ్రాగన్ మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటివరకు..యూఎస్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ వచ్చిన డ్రాగన్ కంట్రీ..
తాజాగా చేసిన మిస్సైల్ టెస్ట్‌తో..ఇన్‌డైరెక్ట్‌గా మరో హెచ్చరిక పంపింది. అదెలాంటి క్షిపణో తెలిస్తే..
షాక్ అవుతున్నారు…
చైనా చేపట్టింది సైనిక విన్యాసాలుగా తాము భావించడంలేదని, అవి తైవాన్ భూభాగంపై దాడికి సన్నాహాలుగా భావిస్తున్నామని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తైవాన్ జలసంధి ప్రాంతంలో అనేక చైనా విమానాలు, నౌకలను తాము గమనించామని, తైవాన్ ప్రధాన భూభాగంపై ఎలా దాడి జరపాలన్నదానిపై అవి ముందస్తు సన్నాహాలు చేశాయని నమ్ముతున్నామని వెల్లడించింది. చైనా విమానాలు, నౌకల్లో కొన్ని మధ్యస్థ రేఖను కూడా దాటాయని ఆరోపించింది…
డ్రాగన్ కంట్రీ.. తొలిసారి అత్యంత ఘోరమైన మిస్సైల్ టెస్ట్ ఫుటేజీని రిలీజ్ చేసింది. చైనా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. డీఎఫ్-17 బాలిస్టిక్ మిస్సైల్‌ని.. ఈ హైపర్ సోనిక్ మిస్సైల్ పోలి ఉంటుంది. పైగా.. ఇది అన్ ట్రేసబుల్. అంటే.. దీన్ని ప్రయోగించిన విషయం గానీ.. అది వెళుతున్న మార్గం గానీ.. దాని టార్గెట్ గానీ.. ఎవరికీ తెలియదు. బ్లాస్ట్ జరిగాక గానీ నష్టమేంటో అర్థం కాదు. అంతేకాదు.. దానిని అడ్డుకోవడం కూడా దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడీ.. అన్ ట్రేసబుల్ హైపర్ సోనిక్ మిస్సైల్ టెస్ట్‌కి సంబంధించిన ఫుటేజ్ మీదే.. ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. ఈ హైపర్‌సోనిక్ వెపన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కిల్లర్ ఫీచర్లను చైనా ఇంకా పూర్తిగా బయటకు చెప్పలేదు. కానీ.. దీనిని ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయోగించే అవకాశముంది…
తైవాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ డెవలయాంగ్‌ప్‌మెంట్ యూనిట్ డిప్యూటీ హెడ్ ఒయు లి-హిసింగ్ అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్‌లో శనివారం ఉదయం ఆయన విగతజీవిగా కన్పించారు. ఆయన మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. యాంగ్ తైవాన్ క్షిపణి అభివృద్ధి బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.