ఆదివాసీ గ్రామ దేవతలను కించపరిచేలా మాట్లాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదు…చినజీయర్‌ స్వామి..

ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి తాము వచ్చామని, వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తమకు లేదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి అన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరు దేవతలను కించ పరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు…ఇవాళ లక్మీదేవి పుట్టినరోజు. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి దగ్గరకు చేరిన రోజు. ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం అని చెప్పాలి. మహిళ.. శక్తికి కేంద్రం. ప్రపంచంలోని మహిళలందరికీ మంగళ శాసనాలు. మన సంస్కృతిలో మొదట చెప్పేది.. మాతృదేవోభవ అనే. వారికి మన ఆదరణ, గౌరవం లభించాలి. ఆరాధ్య స్థానాన్ని కూడా కల్పించాలి. జ్ఞానం చూసి ఆరాధించాలని రామానుజాచార్యులు చెప్పారు. జ్ఞానం చూసి దళితులకూ ఆరాధ్య స్థానం కల్పించారు.లోకానికి ఉపకరించే జ్ఞానం, భక్తి ఉన్నవారందరూ ఆరాధనీయులే. రామానుజ స్వామి పరంపరంగా వచ్చిన వాళ్లం మేం. జ్ఞానంలో ఉన్నతులైన హరిజనులు, గిరిజనులకు ఆరాధన స్థానం కల్పించాం. మనిషికి జన్మ కారణం కాదు.. ఆరాధనకు జ్ఞానమే కారణమని మహనీయులు నిరూపించారు. తిరుప్పాణ్‌ అనే హరిజనుడు. జ్ఞానానికి భగవత్‌ మార్గాన్ని తెరవగల మహనీయుడు. మనిషి బ్రాహ్మణుడా? హరిజనుడా? గిరిజనుడా? అన్నది పక్కన పెట్టి, ఆరాధనకు తగిన వ్యక్తులు అవుతారని నిరూపించారు. రామానుజల కాలంలోనే ఆయన బోధనల వల్ల ఎంతో మంది ప్రేరణ పొందారు. అందులో ఆదివాసీ జనం కూడా ఉన్నారు. వాళ్లందరినీ సంప్రదాయ పాటించే వారిగా తీర్చిదిద్దారు. ఆదివాసీలు, హరిజనులు అన్న తేడా లేకుండా అడుగు వర్గాలు, బడుగు వర్గాలు సామాజిక ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆశించిన ఆచార్యుడు రామానుజాచార్యులు. దాన్ని మళ్లీ పునరుద్ధరించిన మహనీయుడు మా గురువు పెద్ద జీయర్‌స్వామి. ఆయన అడుగు జాడల్లో మేమంతా వచ్చాం. ఒకప్పుడు సమాజంలో మహిళలకు మంత్రం అందకూడదని చెప్పేవారు. రామానుజ పరంపరలో మహిళలు కూడా మంత్ర పఠనానికి అర్హులే అని వాళ్లకు రామానుజులు సమానతను కల్పించారు. మహిళలు మంచి మార్గంలో సాగాలని మంగళం చేస్తున్నాం. మారుమాల ప్రాంతాల్లోని మహిళలు సమాజ ప్రగతి భాగస్వాములు కావాలని కోరుతున్నాం…ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయి. అవి సబబా? కాదా? అనే వివేచన అది ఎలా వచ్చిందో వినేటటువంటి వాళ్లకు వదిలేస్తున్నాం. ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చినవాళ్ల కాబట్టి, అలాంటి వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. అందరినీ ఆదరించాలని అంటాం. స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ మా నినాదం. నేను దేనని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలి. అన్ని నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా! ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటాయి. ఎన్నో రకాల అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు వాళ్ల మార్గంలో సవ్యంగా ఉండేలా ఆదరించాలి. ఆరాధించాల్సిన అవసరం లేదు. మారనవసరం లేదు. మన పద్ధతిని మనం ఆరాధించుకోవాలి. 2002వ సంవత్సరం నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడటం అనుకోవటం పొరపాటు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరం. అది లేకుండా మధ్యలో దాన్ని తీసుకుని, ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది’ అని చినజీయర్‌ స్వామి అన్నారు… ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి తాము వచ్చామని, వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తమకు లేదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి అన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరు దేవతలను కించ పరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు…ఇవాళ లక్మీదేవి పుట్టినరోజు. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి దగ్గరకు చేరిన రోజు. ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం అని చెప్పాలి. మహిళ.. శక్తికి కేంద్రం. ప్రపంచంలోని మహిళలందరికీ మంగళ శాసనాలు. మన సంస్కృతిలో మొదట చెప్పేది.. మాతృదేవోభవ అనే. వారికి మన ఆదరణ, గౌరవం లభించాలి. ఆరాధ్య స్థానాన్ని కూడా కల్పించాలి. జ్ఞానం చూసి ఆరాధించాలని రామానుజాచార్యులు చెప్పారు. జ్ఞానం చూసి దళితులకూ ఆరాధ్య స్థానం కల్పించారు. లోకానికి ఉపకరించే జ్ఞానం, భక్తి ఉన్నవారందరూ ఆరాధనీయులే. రామానుజ స్వామి పరంపరంగా వచ్చిన వాళ్లం మేం. జ్ఞానంలో ఉన్నతులైన హరిజనులు, గిరిజనులకు ఆరాధన స్థానం కల్పించాం. మనిషికి జన్మ కారణం కాదు.. ఆరాధనకు జ్ఞానమే కారణమని మహనీయులు నిరూపించారు. తిరుప్పాణ్‌ అనే హరిజనుడు. జ్ఞానానికి భగవత్‌ మార్గాన్ని తెరవగల మహనీయుడు. మనిషి బ్రాహ్మణుడా? హరిజనుడా? గిరిజనుడా? అన్నది పక్కన పెట్టి, ఆరాధనకు తగిన వ్యక్తులు అవుతారని నిరూపించారు. రామానుజల కాలంలోనే ఆయన బోధనల వల్ల ఎంతో మంది ప్రేరణ పొందారు. అందులో ఆదివాసీ జనం కూడా ఉన్నారు. వాళ్లందరినీ సంప్రదాయ పాటించే వారిగా తీర్చిదిద్దారు. ఆదివాసీలు, హరిజనులు అన్న తేడా లేకుండా అడుగు వర్గాలు, బడుగు వర్గాలు సామాజిక ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆశించిన ఆచార్యుడు రామానుజాచార్యులు. దాన్ని మళ్లీ పునరుద్ధరించిన మహనీయుడు మా గురువు పెద్ద జీయర్‌స్వామి. ఆయన అడుగు జాడల్లో మేమంతా వచ్చాం. ఒకప్పుడు సమాజంలో మహిళలకు మంత్రం అందకూడదని చెప్పేవారు. రామానుజ పరంపరలో మహిళలు కూడా మంత్ర పఠనానికి అర్హులే అని వాళ్లకు రామానుజులు సమానతను కల్పించారు. మహిళలు మంచి మార్గంలో సాగాలని మంగళం చేస్తున్నాం. మారుమాల ప్రాంతాల్లోని మహిళలు సమాజ ప్రగతి భాగస్వాములు కావాలని కోరుతున్నాం…ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయి. అవి సబబా? కాదా? అనే వివేచన అది ఎలా వచ్చిందో వినేటటువంటి వాళ్లకు వదిలేస్తున్నాం. ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చినవాళ్ల కాబట్టి, అలాంటి వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. అందరినీ ఆదరించాలని అంటాం. స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ మా నినాదం. నేను దేనని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలి. అన్ని నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా! ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటాయి. ఎన్నో రకాల అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు వాళ్ల మార్గంలో సవ్యంగా ఉండేలా ఆదరించాలి. ఆరాధించాల్సిన అవసరం లేదు. మారనవసరం లేదు. మన పద్ధతిని మనం ఆరాధించుకోవాలి. 2002వ సంవత్సరం నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడటం అనుకోవటం పొరపాటు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరం. అది లేకుండా మధ్యలో దాన్ని తీసుకుని, ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది’ అని చినజీయర్‌ స్వామి తెలిపేరు.