చిరు, రవితేజ కాంబోలో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ..!!

చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయిన తరువాత చీరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది…!!

దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.అందుకే మెగాస్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి ఎలాగైనా ఆచార్యను మరిపించే హిట్ కొట్టాలని చూస్తున్నాడు..ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది… చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.ఇంకా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది.

మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక తాజాగా ఈ సినిమాపై మరొక అప్డేట్ బయటకు వచ్చింది.చిరు, రవితేజ కాంబోలో క్రేజీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరు చాలా హోప్స్ పెట్టుకున్నారు.
ఇక ఇటీవలే రెండు రోజుల క్రితం రవితేజ చిరు 154 సెట్ లో అడుగు పెట్టినట్టు తెలిసింది.ఇక అప్పుడే రెండు రోజులు కూడా అవ్వకుండానే చిరు, రవితేజలపై వచ్చే ఒక సాంగ్ షూట్ కూడా పూర్తి చేశారట..