నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన చిరుత దొరికింది.అది ఎలాంటిదంటే..!..!.

Leopard in Tirumala :
తిరుమలలో చిక్కిన చిరుత.. అది ఎలాంటిదంటే..!

తిరుమలలో మగ చిరుతపులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. గత రాత్రి 10.45కి ఈ చిరుతపులి బోనులో చిక్కింది. మొన్న అలిపిరి కాలినడక మార్గంలో ఈ చిరుతపులి..

నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసింది. మెడ కొరికింది. ఆ తర్వాత చిన్నారిని ఆస్పత్రికి తరలించి కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు… నిన్న సాయంత్రం 2 బోన్లను ఏర్పాటు చేశారు.

ఈ చిరుతపులి రాత్రి 10 తర్వాత బోనులోకి చిక్కినట్లు అటవీ అధికారులు కనిపెట్టారు. ఐతే.. ఈ చిరుతపులి చాలా మంచిదనీ.. అసలు దీనికి వేటాడటమే రాదని అధికారులు తేల్చారు.

ఈ చిరుతపులి వయసు ఒకటిన్నర సంవత్సరం ఉంటుందని అధికారులు తెలిపారు. మొన్న అలిపిరి మార్గంలో ఓ పిల్లిని పట్టుకునేందుకు ఈ చిరుతపులి ప్రయత్నించి.. ఆ క్రమంలో పిల్లి బదులు పిల్లాణ్ని పట్టుకుందనీ… అందుకే మెడను పట్టుకుందని అధికారులు తెలిపారు.

ఈ చిరుతపులి ఈమధ్యే తల్లి నుంచి వేరైందనీ… 2 రోజులుగా ఆహారం లేక అలమటిస్తూ… పిల్లి అనుకొని… పిల్లాడిపై దాడి చేసినట్లుందని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ చిరుతపులిని.. దట్టమైన, ఆహారం లభించే అడవిలో వదిలేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ చిరుతపులి పూర్తి ఆరోగ్యంతో ఉందని తెలిపారు.