.
తిరుపతి
తిరుమలలో బోనులో చిక్కిన చిరుత
ఇటీవల చిన్నారిని బలితీసుకున్న చిరుత
బాలికపై దాడి చేసిన ప్రాంతంలో బోను ఏర్పాటు చేసిన అధికారులు
అర్ధరాత్రి బోనులో చిక్కిన చిరుత..
తిరుమలలో చిరుత బోనులో చిక్కింది. చిన్నారి లక్షితను లాక్కెళ్లి చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు ఆ సమీపంలో బోను ఏర్పాటుచేశారు. అయితే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఆదివారం అర్థరాత్రి చిరుత చిక్కింది. అలిపిరి నడక దారిలోని ఏడో మైలు దగ్గర ఏర్పాటు చేసిన బోనులో చిక్కగా.. దాని వయసు ఐదేళ్లు ఉంటుందని చెబుతున్నారు. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను తీసుకెళ్లి దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారు. జూన్ నెలలో కూడా ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే.. అప్పుడు కూడా బోను ఏర్పాటు చేయగా.. చిరుత చిక్కింది..
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన వినోద్ కుమార్, శశికళ దంపతులు.. ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. వారంతా అలిపిరి నుంచి కాలినడకన బయల్దేరారు. అయితే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో వినోద్ కుమార్ కుమార్తె ఆరేళ్ల లక్షిత కనిపించకుండా పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఆ తర్వాత అందరూ కలిసి పాపం కోసం గాలించారు.. కానీ ఆచూకీ మాత్రం లభించలేదు. శనివారం ఉదయం నరసింహస్వామి ఆలయం దగ్గర లక్షిత మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని తిరుపతి రుయాలో పోస్ట్‌మార్ట్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. పాప కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
టిటిడి కీలక నిర్ణయం..
ఈ ఘటన తర్వాత టీటీడీ అప్రమత్తం అయ్యింది. భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గాల్లో చిన్నారులపై క్రూరమృగాల దాడులు జరుగుతున్నాయని.. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో శనివారం రాత్రి చిరుతల సంచారం కనిపించిందని గుర్తు చేసింది టీటీడీ..