చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పై కేసు నమోదు…

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివసించే మాజీ ఎంపీ, భాజపా నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ నెల 17న ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌ చేసి తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఎందుకు కలుస్తున్నావంటూ అగౌరవంగా, అసభ్యంగా మాట్లాడారు. దీనిపై ఈ నెల 20న విశ్వేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కేసు నమోదు విషయంలో పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు రంజిత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.