చంద్రగ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు…

*చంద్రగ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు..*

1. సూతక్ కాలం లేదా గ్రహణం సమయంలో ఎలాంటి ప్రయాణాలు, వ్యాపార కార్యకలాపాలు చేయడం మానుకోండి. ఎందుకంటే గ్రహణం భౌతిక కార్యకలాపాలకు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

2. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గ్రహణం, సూతకాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

3. గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావం మీ జీవితంపై పడబోతుంటే, అది తొలగిపోతుందని అంటారు.

4. సూతక్ కాలంలో ఏదైనా తినడం, తాగడం మానుకోండి.

చంద్రగ్రహణం నివారణ

1. చంద్రగ్రహణం సమయంలో వీలైనంత ఎక్కువగా పూజలు, ధ్యానం చేయండి. ఈ విధంగా దేవతలను ఆరాధించడం శుభప్రదం.

2. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తిని నివారించడానికి ఓం నమః శివః జప్‌, శివ జప్, హరి-ఓం మంత్రం, మృత్యుంజయ జప్, దుర్గా మంత్రం, గణేష మంత్రాలను పఠించడం మంచిది.

3. జీవితంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చంద్రగ్రహణం సమయంలో రోగ నివారణ పూజ చేయడం మంచిది.