చాక్లెట్.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా తిని ప్రోడక్ట్. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్న పిల్లలకి పళ్ళు పుచ్చుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు.
కానీ చాలా సందర్భాలలో పిల్లల మారం తగ్గించడానికి వాళ్లే చాక్లెట్లు అందిస్తారు. ఇక భోజనం చేశాక ఏదో ఒకటి తియ్యగా తినాలి అనుకున్న చాలా మంది కూడా చాక్లెట్లు తెగ చప్పరిస్తారు. అయితే చాక్లెట్లలో కొన్ని హానికారక లోహాలు దాగి ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా?
అవునండి నిజం.. ప్రముఖ బ్రాండ్ కంపెనీలు ఉత్పత్తి చేసే చాక్లెట్లను ప్రమాదకరమైన లోహాలు ఉన్నాయని అమెరికాలోని ఒక కన్జ్యూమర్ రిపోర్ట్స్ ద్వారా గుర్తించడం జరిగింది. ఎక్కువ మోతాదులో చాక్లెట్లు తీసుకునే వాళ్ళ శరీరంలో ఈ లోహాలు ఎక్కువ శాతం లో చేరుతాయి. అలా ఎక్కువ కాలం శరీరంలో విడిపోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.
సీసం, క్యాడ్మియం అనే హానికారక లోహాలు కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేసే చాక్లెట్లను అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అమెరికా లో మొత్తానికి 48 చాక్లెట్లు ఉత్పత్తులను పరిశీలించి విడుదల చేసిన. అమెరికా లో మొత్తానికి 48 చాక్లెట్లు ఉత్పత్తులను పరిశీలించి విడుదల చేసిన కన్జ్యూమర్ రిపోర్టులో 16 కంపెనీలు ఉత్పత్తి చేసే చాక్లెట్ ప్రొడక్ట్స్ లో ఈ లోహాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో కదా మనకేమీ అనుకుంటున్నారేమో.. ఆ చాక్లెట్లు మనకు కూడా దొరుకుతాయిగా. పైగా విదేశీ చాక్లెట్ అని చెప్పి మరింత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మరీ కొని తినేది మనమే.
ఈ కేటగిరీ కిందకి మనకు బాగా రెగ్యులర్ గా దొరికే
డార్క్ చాక్లెట్ బార్స్, మిల్క్ బార్స్, కోకో పౌడర్‌లు, డార్క్ చాక్లెట్ చిప్స్, హాట్ చాక్లెట్, బ్రౌనీస్, చాక్లెట్ కేక్‌లు అన్ని వస్తాయి. కొన్ని చాక్లెట్లలో తక్కువ మోతాదులో లెడ్,క్యాడ్మియం కూడా ఉన్నట్టు గుర్తించారు. మరీ ముఖ్యంగా డార్క్ చాక్లెట్లలో ఈ మెటల్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి చాక్లెట్లు వీలైనంతగా తినడం తగ్గించండి.