చుండ్రు నివారణకు ఆయుర్వేదం..

*చుండ్రు నివారణకు ఆయుర్వేదంలో సలహాలు అవగాహనా కోసం.
ఆయుర్వేదంలో చుండ్రు నివారణకు కొన్ని సహజ పద్దతులు ఉన్నాయి.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, ఈ ఉత్పత్తులలో చాలా వరకు రసాయనాలతో నిండి ఉంటాయి. ఆయుర్వేదంలో చుండ్రుతో పోరాడటానికి సహాయపడే అనేక ఇంటి నివారణలు ఉన్నాయి. మీరు సహజంగా పరిస్థితిని నిర్వహించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

1. వేప
“చర్మం యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ చుండ్రుకు కారణమైతే, క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉన్న వేప నూనె చుండ్రును నయం చేయడంలో సహాయపడుతుంది” అని డాక్టర్ వసంత్ లాడ్ రాసిన ‘ది కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్’ పేర్కొంది. వేప యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉన్నాయ.
చుండ్రు సమస్య చాలా మందిని బాధిస్తు ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తలలో ఉన్న చర్మం పొడి బారి పోతే పొట్టు గా మారి తలపైన ఉండే వెంట్రుక కుదుర్ల లో అతుక్కొని ఉండటం వల్ల ఆ పొట్టు లో బ్యాక్టిరియ చేరి విందు చేస్కుంటాయి. తిన్న తర్వాత అవి విసర్జించే దానిలో నుండి కూడా మళ్ళీ బ్యాక్టిరియ పెరిగి పోతుంది.

2.-అంతే కాకుండా తలలో ఉండే వెంట్రుక కుదుర్లు కొంత మందిలో ఎక్కువ గా ఆయిల్ ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల కూడా బ్యాక్టీరియ బాగా పెరుగుతుంది.

3.-సాధ్యమైనంతవరకు రోజు తల స్నానం చేయాలి.

4.-ఈ బ్యాక్టీరియా ను తగ్గించటాని సల్ఫర్ ఉన్న మెడికేటట్ హెయిర్ వాష్ ని వాడవచ్చు. అయితే సమస్య ఏంటంటే సల్ఫర్ ఉన్న షాంపూ వల్ల జూట్టు తెల్లగా అయిపోయె అవకాశాలు ఎక్కువగా.

5.-కుంకుడు కాయ రసం తో పెద్దగా పరిష్కారం ఉండదు.

6.-కానీ ఒక మంచి చిట్కూ తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

*7.- మీ జుట్టు ని బాగా చిన్నదిగా చేయించి చిన్న ఉల్లిపాయను బాగా పేస్ట్ లా చేసుకొని తలకు జుట్టు కుదుర్లలో పోయే వరకు రాస్తూ తల మొత్తం బాగా పెట్టు కోవాలి.*

ఇలా చేయాలి అంటే కొంచెం గుండె గట్టిగా చేస్కోండి. ఎందుకంటే గార్లిక్ పేస్ట్ ఇలా వాడితే ఆ మంట భయంకరం గా ఉంటుంది. ఇలా నెలలో 2 సార్లు చేసి చూడండి మంచి ఫలితం కనిపిస్తుంది.

*8.-ఒక వేళ సల్ఫర్ ఉన్న షాంపో వాడాలని అనుకుంటే దాన్ని పరిమితం గానే వాడండి. ఎక్కువ సమయం వాడకండి అలానే ఫాన్సీ గా ఉండే షాంపులను కూడా ఎక్కువగా వాడకండి. సాధ్యమైనంత వరకు తలను శుభ్రంగా ఉంచండి.*

9.-రోజు తప్పించి రోజు ఓ వారం పాటు వాడండి … చుండ్రు సమస్య పోతుంది .